Saturday, February 24, 2018

DHAEVA DHAASAPAALAKA RAAJAA TELUGU LYRICS

దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందఁగా దేవా దేవా దీన పోషకా ||దేవ||

1. లోకబాధ యిరుకు శోధన నుండి స్వీకరించినావు త్ర్యేకదేవుఁడా స్తోత్రం స్తోత్రం స్తోత్ర మర్పణ ||దేవ||

2. దిక్కు లేని పాపికొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా జయం జయం జయము నొందఁగా ||దేవ||

3. కఠిను లంత కుటిలముజేసి నిన్నుఁ గట్టి కొట్టి నెట్టి నీకుఁ గొయ్య నెత్తిరా యిదే నా యెడఁ బ్రేమఁ జూపితి ||దేవ||

4. ఇంత యోర్పు యింత శాంతమా నాకై పంతముతోఁ బాపికొరకుఁ బ్రాణ మియ్యఁగా పాపిన్ నీదగు దాపుఁ జేర్చవే ||దేవ||

5. కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వమోయఁగా హలెలూయా హలెలూయ హలెలూయ ఆమేన్ ||దేవ||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...