నావన్ని యంగీకరించుమీ దేవా నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహు ధైర్య మొందెద ||నావన్ని||
1. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీఁదుఁగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని||
2. సత్యంబు నీ ప్రేమ చక్కఁగా మదిఁ బూని నిత్యంఉఁ గరముల నీ సేవఁ జేసెద ||నావన్ని||
3. నీ సేవ జరిగెడు నీయాలయమునకు నాసచే నడిపించు మరల నా పదములు ||నావన్ని||
4. పెదవులతో నేను బెంపుగ నీ వార్తఁ గదలక ప్రకటింపఁ గలి గించు దృఢ భక్తి ||నావన్ని||
5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమీ యావంతయైనను నాశింప మదిలోన ||నావన్ని||
6. నీవు నా కొసఁగిన నిర్మల బుద్ధిచే సేవఁ జేయఁగ నిమ్ము స్థిర భక్తితో నీకు ||నావన్ని||
7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి మత్తిల్లకుండఁగ మార్గంబుఁ దెలుపుము ||నావన్ని||
8. హృదయంబు నీ కిత్తు సదనంబుగావించి పదిలంబుగా దానిఁ బట్టి కాపాడుము ||నావన్ని||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment