నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
నవజీవన మార్గమున - నా జన్మ తరియింప
...నడిపించు...
1.
నా జీవిత తీరమున - నా ఆపజయ భారమున
నలిగిన నా హృదయమను - నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
నా నావలొ కాలిడుము - నా సేవ జేకొనుము
...నడిపించు...
2.
రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రాక్షించు నీ సిలువా - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ
...నడిపించు...
3.
ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశా నిరాశాయే - ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలో
...నడిపించు...
4.
ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
ప్రాపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై ఇపుడు - పాటింతు నీ మాట
...నడిపించు...
5.
లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా
లోబడుటకు నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో - లోటైన నా బ్రతుకున్
లోపించని యర్పణగా - లోకేశ చేయుమయా
...నడిపించు...
6.
ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలొ పాదుకొని
ప్రకటింతును లోకములొ - పరిశుద్ధుని ప్రేమకధ
పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభుకొరకు - పానార్పణము జేతు
...నడిపించు...
No comments:
Post a Comment