Wednesday, March 21, 2018

STHOATHRIMCHEDHAMU DHAIVAKUMAARUNI TELUGU LYRICS

1. స్తోత్రించెదము దైవకుమారుని - నూతన జీవముతో
నిరంతరము మారని రాజును - ఘనంబు చేయుదము

పల్లవి: యేసు మా రక్షకుడు - కల్మషము లేనివాడు
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ

2. భయంకరమైన భీతిని గొల్పెడు - జిగట ఊబినుండి
బలమైన హస్తముతో నన్ను ఎత్తి - బండపై స్థిరపరచెను

3. కనుపాపగ నను కాయు ప్రభుండు - కునుకడు నిద్రించడు
తనచేతితో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము

4. తల్లిదండ్రియు యెడబాసినను - విడువక కాయును
ఎల్లప్పుడు నేను భజియించెదను - వల్లభుడేసు ప్రభున్

5. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు - ఆత్మశక్తినిచ్చెన్
స్తుతియు నీకే ఘనతయు నీకే - యుగయుగములలోన

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...