Wednesday, April 18, 2018

RAAJULAKU RAAJAINA YEE MANA TELUGU LYRICS


రాజులకు రాజైన యీ మన విభుని పూజసేయుటకు రండి యీ జయశాలి కన్న మన కింక రాజెవ్వరును లేరని ||రాజులకు||

1. కరుణగల సోదరుండై యీయన ధరణి కేతెంచె నయ్యా తిరముగా నమ్ముకొనిన మన కొసఁగుఁ బరలోక రాజ్యమ్మును ||రాజులకు||

2. నక్కలకు బొరియ లుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు||

3. అపహాసములు సేయుచు నాయన యాననము పై నుమియుచుఁ గృప మాలిన సైనికు లందరును నెపము లెంచుచుఁ గొట్టిరి ||రాజులకు||

4. కరమునం దొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్ ధరణీపతి శ్రేష్ఠుడా నీకిపుడు దండ మనుచును మ్రొక్కిరి ||రాజులకు||

5. ఇట్టి శ్రమలను బొందిన రక్షకునిఁ బట్టుదలతో నమ్మిన అట్టహాసముతోడను బరలోక పట్టణంబున జేర్చును ||రాజులకు||

6. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధముఁ జేసెను భక్తితోఁ బ్రార్థించిన మనకొసగు రక్తితో నాముక్తిని ||రాజులకు||

7. త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు దరికిఁ జేరిన వారిని యీ ప్రభువు దరుమఁ డెన్నడు దూరము ||రాజులకు||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...