Wednesday, April 18, 2018

RAARAAJU JANMINCHINAADU TELUGU LYRICS


రారాజు జన్మించినాడు
ఈ అవనిలోన ఆ నాడు
నీ హృదిలో జన్మించుతాడు
స్థిరపరచుకో నీ మదిని నేడు (2)
యేసే దైవం ఈ సత్యాన్ని తెలుసుకో
యేసే సర్వం నిత్య రాజ్యమును చేరుకో (2) ||రారాజు||


ఇదిగో నేను తలుపునొద్ద
నిలుచుండి తట్టుచున్నాను
ఎవడైనను నా స్వరమును విని
తీసినయెడల వచ్చెదను (2)
అని నిన్ను పిలుచుచున్నాడు
త్వరగా తలుపును తెరచి చూడు
చేజార్చకీ అవకాశము నేడు
రాదీ సమయము ఇంకేనాడు (2) ||యేసే దైవం||


నేనే మార్గం నేనే సత్యం
నేనే జీవం అని అన్నాడు
నా ద్వారా తప్ప తండ్రి కడకు
చేరే మార్గం లేదన్నాడు (2)
ఈ మాటను పరికించి చూడు
యోచించుము నిజమేదో నేడు
త్వరలో ప్రభు రానైయున్నాడు
ఆ లోపే యేసయ్యను వేడు (2) ||యేసే దైవం||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...