Wednesday, April 18, 2018

RAAROA JANULAARAA VAEGAMUAO TELUGU LYRICS


రారో జనులారా వేగముఁ గూడి రారో ప్రియులారా శాశ్వతమైన ఘన రక్షణఁ జేర సారాసారముల్ సమ్మతిగాఁ జూచి ధీరత్వమునఁ క్రీస్తు జేరు దారిఁ గోరి ||రారో||

1. అనుమానము లన్ని మీరలు మాని ఆద్యంతము లేని కనికరము చేత మనల రక్షింపను దన జీవము నిచ్చు ఘనునిఁ క్రీస్తుని గొల్వ ||రారో||

2. మన పాపము లన్ని మోయను దే వుని చేఁ బనిఁ బూని మనుజావ తారుఁడై వినుట కద్భుతమైన పను లెన్నో చేసి సి ల్వను బడిన ఘనుఁ జేర ||రారో||

3. పాపాత్ము లగు వారి భారముఁ ద్రుంచు బలుడైన యుపకారి ఓపికతో ఁ దన దాపుఁ జేరిన వారి శాపము తా మోసి కాపాడు ఘనువే(డ ||రారో||

4. తన యాత్మకుఁ గీడు గల్గించెడు ఘనత లెల్లను పాడు తనువు నిత్యము గా దని యభిమాన మును వీడి మన క్రీ స్తుని జడ గతిఁజూడ ||రారో||

5. సకలాంతర్యామి నిరాకారు డొకడే యంతట సామి ప్రకట ముగా మర్త్యు లకునెల్ల మధ్యస్థు డొకడే క్రీస్తుడు సం రక్షకుడై యిలుకు వచ్చె ||రారో||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...