Friday, May 11, 2018

SAAGILAPADI MROKKEDHAMU SATHYAMUTHOA-TELUGU LYRICS


పల్లవి: సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో - ఆత్మతో
మన ప్రభుయేసుని ఆ....ఆ....ఆ....

1. మోషేకంటె శ్రేష్ఠుడు - అన్ని - మోసములనుండి - విడిపించున్
వేషధారులను ద్వేషించున్ - ఆశతో - మ్రొక్కెదము

2. అహరోనుకంటె శ్రేష్ఠుడు - మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు - అందరము - మ్రొక్కెదము

3. ఆలయముకన్న - శ్రేష్ఠుడు - నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము

4. యోనకంటె శ్రేష్ఠుడు - ప్రాణ - దానముగా తను అర్పించెన్
మానవులను విమోచించెన్ -ఘనపరచి మ్రొక్కెదము

5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు - సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము

6. రాజులకంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ - రయముగను మ్రొక్కెదము

7. అందరిలో అతి శ్రేష్ఠుడు - మనకందరికీ తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...