Thursday, February 1, 2018

STHUTHIYOO PRASHMSAYOO MAHIMAYOO TELUGU LYRICS

పల్లవి: స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ
నా ముక్తి దాతకే
ఆత్మసత్యముతో - ఆరాధించెదన్
హృదయపూర్వక - కృతజ్ఞతలన్
సదా సర్వదా చెల్లింతున్ - 2

1. కొనియాడెదన్ నీదు కల్వరి ప్రేమను
వర్ణించలేను నీ అపార ప్రేమను
ఘోరవేదన - సంకట శ్రమలన్
శపిత సిల్వపై క్రీస్తు సహించెను
తండ్రి చిత్తము నూ నెరవేర్చెను

2. కీర్తించెదా నీదు అపారకరుణకై
పరమ పుత్రుండు వేదన నోర్చెను
అవమాన నిందలు - మోముపై ఉమ్మియూ
ప్రేమతో అన్నియూ సహించె మౌనమున్
అమూల్య ప్రాణమిచ్చె మానవాళికే (మనకొరకే)

3. కృతజ్ఞత చెల్లించెద నీ బలిదానమునకై
అంతులేని నీ గొప్ప ప్రేమకై
అనంత జీవము మహిమ నిరీక్షణ
నా జీవితమునకే ఆధారమాయె
క్రీస్తుకే పాడెదన్ హల్లెలూయ

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...