Thursday, December 28, 2017

NI PADAM MROKKEDAN NITHYAMU STUTINCHI TELUGU LYRICS



 నీ పాదం మ్రొక్కదన్‌ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదన
 యేసయ్య నీ ప్రేమ పొంగుచున్నది ||2||

 1. పరిశుద్ధమైన పరవశమే పరమయేసు కృపావరమే
     వెదకి నన్ను కనుగొింవి
     పాడుటకు పాట నిచ్చితివి ||నీ||

 2. నూతన నూనె ప్రభావముతో నూతన కవిత్వము కృపతోను
     నింపి నిత్యము నడిపితివి
     నూతన షాలేము చేర్చెదవు ||నీ||

 3. ఇరుకునందు పిలచితివి నాకు సహాయు చేసితివి
     చెడి ఎక్కడ తిరుగకుండ
     చేరవచ్చి నన్ను ఆదుకొింవి ||నీ||

 4. నిత్యముగ నీ సన్నిధి నాకు ఇచ్చును విశ్రాంతిని 
     దుడ్డుకర్ర నీ దండమును
     నిజముగ నన్ను ఆదరించును ||నీ||

 5. ఫలించు చెట్టు నీవు నిలచు తీగగ నేను వ్యాపించుటకై 
     కొమ్మనరికి కలుపు తీసి
    కాపాడి శుద్ధీకరించితివి ||నీ||

 6. నా హృదయ దైవం నీవు నాదు రక్షకా నా ప్రాణమా
     ప్రేమించెదన్‌ యేసునాధా
     ప్రేమముఖము దర్శించెదను ||నీ||

 7. పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై 
     శ్రీఘ్రముగా చేర్చెదవు 
     సీయోనులో నిన్ను కీర్తించెదన్‌ ||నీ||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...