Thursday, December 28, 2017

DEVUNIKI STOTHRAM GANAMU CHEYUTAYE TELUGU LYRICS


 దేవునికి స్తోత్రగానము చేయుటయే మంచిది
 మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది

 1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
  ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని

  2. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని
  వారి గాయములన్నియు కట్టుచున్నవాడని

  3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
  వాికన్నియు పేరులు పెట్టుచున్నవాడని

  4. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
  జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని

  5. దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును
  సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి

  6. ఆయన ఆకాశమున్‌ మేఘములతో కప్పును
  భూమి కొరకు వర్షమున సిద్ధపరచువాడని

  7. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును
  అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును

  8. గుఱ్ఱముల నరులందలి బలము నానందించడు
  కృపకు వేడు వానిలో సంతసించువాడని

  9. యెరుషలేము యెహోవాను సీయోను నీ దేవుని
  కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని

  10. పిల్లల నాశీర్వదించియు బలపరచుఉ నీ గుమ్మముల్‌
  మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును

 11. భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
  వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును

 12. వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడని
  ఏ జనము కీలాగున చేసియుండలేదని

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...