బాలకా నీ వర్తనము గా పాడుకొని జీవింపరా మేలులుకుఁ బలు కీడు లకునదె మూలమనిగమనింపరా ||బాలకా||
1. తప్పినడువకు మెన్నడేని తల్లిదండ్రులు యానతి తప్పిపోయిన సుతుఁడు పడిన తిప్పలు నీ వెఱుఁగవా? ||బాలకా||
2. గోలచేయుచుఁ బెద్దలనుగని మేలమాడుట తగదురా బాలురా యెలిషాను నవ్వి ప్రాణగొడ్డమునొందరే ||బాలకా||
3. పరులకెగ్గొనరింపఁబోకుము దొరలునదినీ మీఁదనే పరునికై హామాను నిల్పిన కొఱఁత నతఁడే వ్రేలఁడే ||బాలకా||
4. కట్టఁడి కార్యంబుతుదకుఁ బట్టి కుడుపకపోదురా మిట్టిపడిన రాణి యెజెబె లెట్టులీల్గెనొ తెలియదా? ||బాలకా||
5. వగవకుము పరధనముఁగనియది తెగులులేని బాధరా సుగతిగనెనె యాహబుతా శునకముల కాహారమై? ||బాలకా||
6. ఆనృతంబులాడకుము దే హాంతమైన నేమిరా? ఆనృతము చేనని యాతన యాలితో సహకూలఁడే ||బాలకా||
7. కోపమునకాన్పదమునీయఁ గోరకుము మదినెన్నడు కోప జ్వాలలు పెంచికయ్యిను గోడు చెందడె హంతయై ||బాలకా||
8. తులువల జత గూడిమాడి చెలిమిచేయుట తగదురా పలువల సాంగత్యమున రెహ బాము భంగము నొందఁడే ||బాలకా||
9. బాలుడా నీ తరుణ హృదయము ప్రభున కప్పగింపరా శీల సౌష్ఠవ మొదవునీ కా శీస్సులను జేకూరురా ||బాలకా||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment