పల్లవి: బేత్లెహేం పురమున - చిత్రంబు కలిగె
కర్తాధి యేసు - జన్మించినపుడు
అంధకారంపు - పృథివి వీధులలో
మోదంపు మహిమ - చోద్యంబుగనరే
1. ఉదయంపు తారల్ - ముదమున బాడె
ఉదయించ యేసు - ఈ పృథివిలోన
ముదమును గలిగె - మరి సమాధానం
పదిలంబుతోడ - పూజించ రండి
2. పరమును విడచి - నరరూపమెత్తి
అరుదెంచె యేసు - పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ - తొలగించివేసి
పరలోక శాంతి - స్థిరపరచె ప్రభువు
3. నీదు చిత్తమును - నాదు హృదయమున
ముదమున జేయ - మదినెంతో యాశ
నీదు పాలనము - పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగజూడ
4. దేవుని సన్నిధి - దీనత నుండ
పావనయాత్మ - పవిత్ర పరచున్
పావను డేసు - ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి - జీవించు నెదలో
5. గతించె రాత్రి - ప్రకాశించె కాంతి
వితానముగ - వికసించె నెల్ల
దూతల ధ్వనితో - పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ - అరుదెంచె నోహో
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment