పరమ ప్రభో యేసురక్షకా ధననరుల బ్రోచి పరమ కారోహణంబైతివా మరియయందు జననమొంది వరము లిడుచు దిరిగిధరను మరణమొంది తిరిగిలేచి పరము కేగితివా ప్రభో ||పరమ||
1. ఘోర పాపభారముతోడ దరిగానలేకఁ దిరుగుచుండినట్టి మమ్మును కూరిమితోఁ దరికిఁబిలిచి భారమును నీవేమోసి ఊరకమము క్షమియించి నేరములను బాపిన ప్రభో ||పరమ||
2. సిలువమరణమొందినఁ ప్రభువా ఇలనరుల ఘోర కలుషములను బాపిన ప్రభువా విలువలేని నీదు బ్రతుకు బలముగల నీ ప్రేమ సేవ సలితముగ ననుకరించి ఇలను మేము బ్రతుకునట్లు ||పరమ||
3. చెఱను చెఱగఁబట్టిన ప్రభువా ధనరులకెల్ల వరములను విరివి నిడితివా పరముకేగి పరమతండ్రి పరమున కుడిపార్శ్వమందుఁ దిరముగాఁ గూర్చుండి యుండి తిరిగి ధరకు వచ్చెదవా ||పరమ||
4. నీదు రాక కెదురుజూచెడి నీ దాసులను సదయతతో జూడుమో ప్రభో మాదినపు ప్రార్థనలను మాదు స్తోత్రములను మిగులఁ బ్రోదిగా గైకొనుచు నేడు బ్రోవుమయ్య మమ్ములను ||పరమ||
5. పంపుమయ్య నీదు ఆత్మను పదిలముగ దయతో సొంపుగ నీ శుద్ధాత్మను నింపుమయ్య నీదు కృపతో ఇంపగు నీవరములతో సొంపు గాను నీదు సేవ జేయనిలను నెల్లపుడు ||పరమ||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment