Wednesday, January 31, 2018

STHUTHIYIMTHUMU STHOATHRIMTHUMU TELUGU LYRICS

పల్లవి: స్తుతియింతుము - స్తోత్రింతుము
పావనుడగు మా - పరమ తండ్రి

1. నీ నామము ఋజువాయే - నీ ప్రజలలో దేవా
వర్ణింప మా తరమా - మహిమ గలిగిన నీ నామమును

2. మా ప్రభువా మా కొరకై - సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై - రక్తమును కార్చిన రక్షకుడా

3. మా ప్రభువైన యేసుని - పరిశుద్ధాత్మ ప్రియుని
ప్రియమగు కాపరులన్ - ప్రియమారా మా కొసగిన తండ్రి

4. పరిశుద్ధ జనముగా - నిర్దోష ప్రజలుగా
పరలోక తనయులుగా - పరమ కృపతో మార్చిన దేవా

5. సంపూర్ణ జ్ఞానమును - పూర్ణ వివేచనమును
పరిపూర్ణంబుగ సలుగ - పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి

6. ప్రభు యేసు క్రీస్తులో - పరలోక విషయములో
ప్రతియాశీర్వాదములన్ - ప్రాపుగ నొసగిన పరమ తండ్రి

7. ఎల్లరిలో జీవజలం - కొల్లగ పారునట్లు
జీవంబు నిచ్చితివి - జీవాధిపతి హల్లెలూయ

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...