స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా ||2|| ||స్తుతియు||
మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభ దినము ||2||
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము ||2||
కొనియాడేదము మరువబడని మేలుల చేసెనని ||2|| ||స్తుతియు||
నీవొక్కడవే గొప్ప దేవుడవు
ఘనకార్యములు చేయుదువు ||2||
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా ||2||
నిన్ను మేము ఆనందముతో ఆరధించెదము ||2|| ||స్తుతియు||
నీవే మాకు పరమ ప్రభుడవై
నీ చిత్తము నెరవేర్చితివి ||2||
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా ||2||
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను ||2|| ||స్తుతియు||
భరియించితివి శ్రమలు నిందలు
ఓర్చితివన్ని మా కొరకు ||2||
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ ||2||
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము ||2|| ||స్తుతియు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment