Saturday, January 27, 2018

YEHOAVA YMDHU BHAKTHI BAHUGA TELUGU LYRICS

యెహోవ యందు భక్తి బహుగ గలిగియుండి మహిమాఢ్యుని మార్గంబులయందు గృహముల నడుపు నరులే ధన్యులు||

1. దేవుని యందలి భయము దీనుల దీవించున్ నీవు నీ జేతుల కష్టార్జితమును నిత్యము ననుభవంతువు నిజముగ ||

2. ఉల్లమలర భార్య ద్రాక్షా వల్లివలె ఫలించు పిల్లలొలీవ మొక్కల చందము పెంపొందుదు రెంతయు సొంపుగను ||

3. దేవుని భక్తియే నీ కిల దీర్ఘాయువు నిచ్చు( గావున నీ పిల్లల పిల్లలను గాంతువు ప్రభు కృపతోఁ వెలగుదువు ||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...