Thursday, February 1, 2018

AMRUTHAMU ADHBHUTHAMU DHIVYASATHYAMU TELUGU LYRICS

1. మంగళముగ పాడుడీ - కృప సత్యంబును
రంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యము
విజయ సత్యవేదము - మంగళ నిత్యదీపము

పల్లవి: అమృతము అద్భుతము దివ్యసత్యము

2. సువి శేషమును ప్రకటింపు - కృప సత్యంబును
పాప ఘోరంబు తెల్పును - దివ్యవాక్యము
పరలోక వర్షము - జ్ఞాన నింపుదలయును

3. దేవుడేసు హర్షించెడు - కృపసత్యంబును
జీవ మంగళ వాక్యముల్ - దివ్యవాక్యముల్
యేసు నన్నుచూడు - నిత్యము శుద్ధీకరించు

4. రెండుయంచుల ఖడ్గము - కృప సత్యంబును
ఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యము
యోచనల్ చూపుదర్పణము - కలితిలేని జ్ఞానము

5. ఆత్మకాహారమిదియే - కృప సత్యంబును
పాపికి జీవపానము - దివ్యవాక్యము
పాదములకు దీపము - కాళ్ళకు మంచి వెల్గును

6. విశ్వాసుల సువార్తయే - కృప సత్యంబును
నిశ్చయమైన పునాదియే - దివ్యవాక్యము
విడుదలనిచ్చు సత్యము - ఉన్నతలోక సత్యము

7. హల్లెలూయ పాడెద - కృప సత్యంబును
అపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యము
ప్రభువు నామమిదియే - నాదు ఆస్తియునిదే

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...