Thursday, February 1, 2018

ANAADHI DHAEVUDU AASHRAYAMU THANA TELUGU LYRICS

పల్లవి: అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే

అను పల్లవి: నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు
మరణము వరకు మమ్ము నడిపించును

1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ
ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్

2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి
దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్

3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ
నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును

4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే
కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు

5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే
శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్

6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే
సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...