నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుఁడు నా యేక రక్షకుఁడు గనుక ||నాకేమి||
1. తనివి దీర మేళ్లనుభవింప నేను నను సదా మేళ్లనెడి పచ్చిక నదిమి మృదువుగఁ బండు కొనఁజేయును గనుక ||నాకేమి||
2. ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు నోరిగర దెపుదు శాంత జలములు నా చెంతనే యుండు గనుక ||నాకేమి||
3. తప్పిపోయిన నన్ దారిం బెట్టి నన్ను తెప్పరిల్లఁజేసి నాకుఁ దీరు నలసటను నా తప్పు మన్నించున్ కనుక ||నాకేమి||
4. నీతి మార్గమునన్ నిల్పున్ నన్ను ప్రభువు నీతి లేని నాకుఁ దనను నీతి దయ చేయున్ స్వ నీతిని ద్రుంచున్ గనుక ||నాకేమి||
5. చావు చీఁకట్ల శక్తియుండు ఆహా లోయలోఁబడి పోవలసినను నే వెరవకుందు నా దేవుండే తోడు గనుక ||నాకేమి||
6. మీఁదఁబడునట్టి శోధనలన్ ధరను నా దరికి రానీక దండము నన్ను బ్రోచుచును నా కాదరణ యౌను గనుక ||నాకేమి||
7. పగవారల్ సిగ్గు పడునట్లుగ నా జగము యెరుఁగని సౌఖ్యభో జన మగపరుచును హా తగినదే పెట్టున్ గనుక ||నాకేమి||
8. తన యాత్మానంద తైలంబుతో ప్రభువు ననుదినము తలయంటి విసుగ కొనక తుడుచును నా కన్నీళ్లన్ని గనుక ||నాకేమి||
9. పలువిధములైన భాగ్యములతో తండ్రి వెలుపలికి దిగవెడలునట్టి వెల గల గిన్నె నా కలిమిగాఁ జేయున్ గనుక ||నాకేమి||
10. బ్రదుకంతటన్ గృ పాక్షేమములు నా వదలకుండగ వచ్చు నాతో సుదినములు గల్గ నా పదలు సంపదలౌ గనుక ||నాకేమి||
11. దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవు కాఁదిక నెప్పటికి నా పరమ దేవుని మందిరమె నా యిల్లు గనుక ||నాకేమి||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment