పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు సేవ దురితంబులకు నేను వెఱచి యున్నానని కరుణించి నీ సుతుని ధర కంపితివి గాదా అరయఁగా నీ ప్రేమ యింతనఁ దరము గాదో పరమ జనక మరణ పర్యంతంబు నిను నే మరువఁ జాలను వరకృపా నిధి ||పరలోక||
1. యేసుక్రీస్తుని దయసేయ కున్న మోస మొందెద నెందుకన్న దోసంబులకు నేను దాసుండనై ప్రతి వాసరంబును నీదు భాసు రాజ్ఞలు విడిచి వేసటలు గల నరకమునఁ బడ ద్రోసిన నది న్యాయమౌ గద నా సునాధా పేర్మిచేతను నీ సుతుని నంపించినావు ||పరలోక||
2. ఎన్నరాని మహిమ నుండి యేసు నన్నుఁ బాలింప నేతెంచి యెన్న శక్యము గాక యున్న పాపములన్ని ఛిన్నాభిన్నము జేసి నన్ను సమ్మతిపరప నన్న యగు నా రక్షకుండు తన్ను తానర్పించి వెండియు నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసఁగె నాకుఁ ||బరలోక||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment