యెహోవా నా కాపరి లే మేమి గలుగదు తన మహా కృపతోఁ బ్రోచి నన్ను మనుపు నాతఁడే||
1. పచ్చికగల చోట్ల నను పరుండజేయుచుఁ గడు హెచ్చగు సౌఖ్యములు సదా యిచ్చు నాతఁడే||
2. శాంతికర జలములకు నను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు విభుఁడు అతఁడే||
3. గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిఁక నా తోడు ఆయనే||
4. దుడ్డుకఱ్ఱతో శత్రువులఁ దరుమఁగొట్టుచుఁ దన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపు||
5. అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతోఁ గడు విందు లొసఁగి తృప్తిపరుచు విభుఁడు ఆయనే||
6. ముఖము కళగా నుండునట్లు మంచితైలమున్ నా సఖుఁడు నాకుఁ బూయుచుండు సకల వేళలన్||
7. బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే నను వెదకి కృపా క్షేమములు నా వెంటవచ్చును||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment