నేర్చుకొనరే యేసువాడుక లనుదినము మీ బ్రతుకునందున నేర్చుకొనిన మీరలాయన జనముగ నొప్పుదురు ఇలలో ||నేర్చుకొనరే||
1. ఆలయ ఆరాధనలకు బోయెడియలవాటుగలిగియు చాలమారులు ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక ||నేర్చుకొనరే||
2. దేవవాక్య పఠనమందున దీక్షగలిగియు మరియ సుతుడు దివ్యముగ నా గ్రంథ పఠనము జేసినవిధంబు మీరలు ||నేర్చుకొనరే||
3. పరమ తండ్రికి ప్రార్థనలు ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను ప్రార్ధించి మనలను నిరతమును ప్రార్ధింపమనెను ||నేర్చుకొనరే||
4. బీద పాపులు బాధితులు బంధింపబడిన వారి కెల్లను ఆదరము జూపించి మేలును జేసిన విధంబు మీరలు ||నేర్చుకొనరే||
5. సువార్త ప్రకటనజేయుట సుభాగ్యముగ దానెంచి యీ భువి సేవలో సువార్త జాటుచు సంచరించిన యేసు వాడుక ||నేర్చుకో||
6. అక్కరలలో దన్నుజేరి మక్కువతో బ్రార్ధించి వేడిన పెక్కు జనముల యక్కరలను జక్కగ దీర్చిన విధంబును ||నేర్చుకొనరే||
7. దైవచిత్తము దీర్చుటయే తన ధర్మ విధిగ నెరిగి యాయన ధరణిలో నా ధర్మమునకై మరణమొందిన విభుని మాదిరి ||నేర్చుకొనరే||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment