Thursday, March 29, 2018

ISHRAAYAELEEYULA DHAEVUMDAE TELUGU LYRICS

ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె ||నిశ్రా||

1. తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె ||నిశ్రా||

2. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె ||నిశ్రా||

3. జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ ||నిశ్రా||

4. ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె ||నిశ్రా||

5. ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద ||నిశ్రా||

6. మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి ||నిశ్రా||

7. మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె ||నిశ్రా||

8. జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్ ||నిశ్రా||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...