Thursday, March 29, 2018

NAENUNU NAA YIMTIVAARUNU NEETH TELUGU LYRICS

నేనును నా యింటివారును నీతి సూర్యుని గొలుతుము దీనమనసును గలిగి దేవుని దివ్యసేవను జేతుము||

1. అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము అనవరత మా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో ||

2. వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము ఆదరంబున దైవ చిత్తము ననుసరించుచు నడుతుము||

3. ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక విసుకు జెందక నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము ||

4. సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రతీతో భంగ పరచెడి పనులన్నిటి కృంగదీసెదమనిశము ||

5. ప్రేమతోడను పొరుగువారిని ప్రియులుగను భావింతుము క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము ||

6. శక్తిగొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము భక్తితో హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము ||

7. చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును అన్నివేళల వారి వృద్ధికి మిన్నగ దోడ్పడెదము ||

8. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను జూపుచు ||

9. జీవితంబున ప్రభుని ప్రేమా శ్శీసులను ప్రసరింతుము దివ్యజ్యోతుల రీతి వెలుగుచు దివ్యసన్నిధి నుందుము |

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...