నమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ జేరి నమ్మిన వారల నిమ్ముగ బ్రోచును సొమ్ముగ తను జేర్చి ||నమ్మరె||
1. యేసు క్రీస్తుకంటెఁ పోషకు లెవ్వరు లేరుసుమీ దోషుల తన దాసులుగాఁ దీసియు దోసముఁ బాపు సుమీ ||నమ్మరె||
2. నరకము నొందక మీ రయ్యో నరకము బాధ సుమీ న్యాయము కాదుసుమి నరులార నష్టము మీకు సుమీ ||నమ్మరె||
3. తండ్రి కొమరుఁడు విమ లాత్ముఁడు త్ర్యేకదేవుండు తండ్రి వలెను మనలను పాలించును తండ్రిగ నమ్ముదము ||నమ్మరె||
4. ధరణిలో నొకఁడైన చూడరె ధన్యుడు లేఁడనుచు దీర్ఘదర్శి దావీదు తెల్పె నిటు దీనుల కందఱికి ||నమ్మరె||
5. ప్రభు మన పాపముకై ప్రాణము బలిగా నిచ్చునుగా పాపము మోసెను మృతియై లేచెను పాపులఁ బ్రోచుటకై ||నమ్మరె||
6. దేవసుతుని రక్తం అబ్బిన ద్రోహుల కతిప్రొయము పావన మొనరించును పాపికి నిఁక జీవనమై యుండున్ ||నమ్మరె||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment