స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతోఁ దండ్రిన్ ధాత్రిని మన పర మాత్ముని వాక్కులు స్తోత్రములోఁ గలిపి ||స్తోత్రము||
1. ఇచ్చట ప్రేమల కిదియే కడవరి వచ్చియున్న దేమో అచ్చట మన మం దఱముఁ గలిసికొని యానందింతుముగా ||స్తోత్రము||
2. ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రము లక్కడ మన మంత మిక్కిలి ప్రియుడు దేవుని కిడుదుము ఒక్క మనసుతోను ||స్తోత్రము||
3. కన్నీ రుండదు చావు కష్టము లెన్నటి కుండవుగా కన్నను మన శృం గారపు బ్రతుకు లెన్నఁదరము గాదె ||స్తోత్రము||
4. వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట రాగము లెంతో రమ్య మై యుండును బాగింతన లేము ||స్తోత్రము||
5. మరల నిచటఁ గూ డుదుమో లేదో మన మందరము త్వరలో మున పర లోకపు దండ్రి తోడ నుందు మేమో ||స్తోత్రము||
6. గొఱ్ఱెపిల్ల రక్తము విలువచ్చుట గొప్పది గాంతుముగా గురుతరమగు మన దేవుని ప్రేమను కూర్మితో జూతుముగా ||స్తోత్రము||
7. పరమ తండ్రితోఁ ప్రభుయేసునితోఁ బరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతోఁ బరలోకమునందున్ ||స్తోత్రము||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment