యేసు! నా సిలువ నెత్తి యిప్పుడు నే నీ సుమార్గముఁ బట్టితి నా స్వజనము లనాదరంబునఁ త్రోసినను పగజేసిన నా సమస్తము నీవెగా యిక నే సరకుగొన నేమియున్ ||యేసు||
1. ఎన్ని శ్రమలు వచ్చిన లోకపు టాశ లన్ని భిన్నము నొందిన నన్ను ఖిన్నునిజేయ నేరవు సన్నుతుండును స్వర్గము నన్ని నావైయున్న విగ నిఁక నన్నుఁ గదుపున దెవ్వరు ||యేసు||
2. ఆపదల్ ననుఁ జుట్టినఁ జేరుదు నే నో పరాత్పర రొమ్మునఁ బ్రావ కుండవు పతితుఁడై నీ దాపు జేరిన వానికిన్ దాప మాపుచు సంతసంబిడి ధన్యుఁ జేయుదు వీవెగా ||యేసు||
3. నినుఁ బ్రేమించెడు తండ్రిని నా యాత్మా నిను రక్షించిన క్రీస్తును గనుమునిన్నుఁ జొ చ్చిన ప్రియాత్మను ఘన త్ర్యేకుని నిత్యమున్ గొనుము రక్షణ, పాపము చింతను విడిచి యిం కెన్నఁడున్ ||యేసు||
4. విశ్వాస కవచంబును మేను నిడి విజ్ఞాపనము చేయుము శాశ్వతంబగు రాజ్యమునకును సదయుఁడౌ ప్రభువు నడుపు విశ్వసితము లభించునట నీ విన్నపము స్తుతి యౌనుగా ||యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment