Thursday, March 29, 2018

YAESU NAAMAAMRUTHAMU KANNANU TELUGU LYRICS

యేసు నామామృతము కన్నను వేరే మాకిఁక లేదుగా దోసముల నెడబాపి పరమని వాస పదవికిఁ జేర్చుఁగా ||యేసు||

1. నిత్య రక్షణ నిత్య జీవము నిజముగా మాకిచ్చును సత్యసువిశేషార్థసారము సతము గ్రోలుట కొసఁగెను ||యేసు||

2. దురిత భవ మను నంధకారము దూరముగఁ బోఁదోలెఁగా అరయఁ దన విమలాత్మ వరమున మరల మము వెలిఁగించెఁగా ||యేసు||

3. గొప్ప కుల గర్వముల మెప్పను తప్పుల న్విడఁగొట్టెను చెప్ప శక్యముగాని రక్షణ సృష్టిలో మము నిల్పెను ||యేసు||

4. అడ్డు పరచు పిశాచి మార్గపు జిడ్డులను ఛేదించెను దొడ్డ కాపరి యేసు తన దగు దొడ్డిలో మముఁ జేర్చెను. ||యేసు||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...