యేసు నామమే పావనము మాకు యేసు గద నిత్య జీవనము దాస జన హృద్వికాసమైయెల్ల దోసములకు వి నాశకరమైన ||యేసు||
1. సాధు మానసోల్లాసములు యేసు నాధు గుణ చిద్విలాసములు బోధఁ గొను వారి బాధ వెడలించి మాధుర్యమగు ముక్తి సాధనములిచ్చు. ||యేసు||
2. భక్త జన లోక పూజ్యములు రక్త సిక్త పాదపయోజములు ముక్త రాజ్యాభి షిక్తుఁడౌ సర్వ శక్తి యుతుఁడైన సామియగు క్రీస్తు ||యేసు||
3. దీన జన నిత్య తోషణము సిల్వ మ్రాని ప్రభు మృత్యు ఘోషణము పానకము జుంటి తేనియల స్వాదు వీనులను గ్రోలు మానవుల కెల్ల ||యేసు||
4. పాపులకు మంచి పక్షములు ముక్తిఁ జూపు క్రీస్తు కటాక్షములు పాప సందోహ కూపమునఁ గూలు కాపురుషు నన్నుఁగాచుకొనిప్రోచు ||యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment