యేసుక్రీస్తు దొరికె నేని యేమికొదువింకేమి భయము దోసకారి జనుల కెంతోఁ గ్రాసమవునా యేసు పేరు ||యేసు||
1. తల్లిదండ్రులకన్న చాలాఁ దన ప్రేమ మనమీద నెల్లకాలమందు నుంచు యేసుఁడే మా తండ్రియౌను ||యేసు||
2. వల్లగాని వశములేని యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు కొల్లగా మన కిచ్చెడి దేవ కొమరుఁడే వేరెవరు లేరు ||యేసు||
3. దండియైన గండములు మెండుగాను మముఁజుట్టిన తండ్రివలె మా దరికి వచ్చి గండములను గదిమిఁ బ్రోచున్ ||యేసు||
4. సత్యము మార్గముతానె నిత్యజీవమింకా తానే భ్రుత్యుల మనకీయ మోక్షము భువిని రక్తమంత గార్చె ||యేసు||
5. ఎన్నరాని పాపాత్ముల కన్నులారా కనికరించి పున్నెమైన తన ప్రాణము భువిని బలిపెట్టినాఁడు ||యేసు||
6. ఒడలు నిండా గాయములతో నడరు చుండమరల లేచి వెడలి పరమందునుండి వేడుకలు మాకంపినాఁడు ||యేసు||
7. ఆశతోడఁ తన్ను నమ్ము యాత్మలకు దర్శనమిచ్చెడి యేసుతో నింకెవరు సాటి లేశమైనా లేరుసుండీ ||యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment