Thursday, March 29, 2018

YAESUKREESTHUNI DHAASULAARAA TELUGU LYRICS


యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె ఆశతో యెహోవ యాజ్ఞల నభ్యసింపగ జేయరే ||యేసు||

1.
పిల్లలెప్పుడు ననుసరింతురు తల్లిదండ్రుల నడతలన్ ఎల్ల విషయము లందు మాదిరి పిల్లలకు గనుపర్చరే ||యేసు||

2.
మోదమిచ్చు కుటుంబ ప్రార్థన నేదినంబును మానక ఆదివారపు బడికి బిడ్డల నాదరముతో బంపరే ||యేసు||

3.
యేసునాధుని బోలు నాయకు డే జగంబున లేడని యేసు కే నిజ శిష్యులగుటకు నేర్పరే యౌవనులకు ||యేసు||

4.
యేసు శౌశీల్యమును వారికి బోధింపరే పసితనమునె వారి హృదయము యేసురూపము దాల్చును ||యేసు||

5.
యేసుక్రీస్తులొ నిలిచి వారలు యేపుమీర ఫలింపగా యేసు వాక్యము వారి యెదలలో నాశతోడను నాటరే ||యేసు|| 

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...