యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను వెఱవము వెఱవము యేసు దాసులతో బొత్తు భక్తి మా కమరెను జడియము జడియము ||యేసు||
1. లోక జ్ఞానములోని లోతుఁ దెలిసి మేము లొంగము లొంగము యేసు రాకడకొఱకు సంత సించి యెల్లప్పు డుండెద ముండెదము ||యేసు||
2. దైవజనుల మని ధైర్యముతో మేము పల్కెదము పల్కెదము పాప భారమంతయు యేసు ప్రభున కప్పగించి బ్రతుకుచు బ్రతుకుచు ||యేసు||
3. శుభవర్తమానము సొంపుగా నరులకుఁ జెప్పెదము జెప్పెదము లోక వైభవములను వాంఛించక యేసుని పలికెదము పలికెదము ||యేసు||
4. నీతికవచంబును నెనరుతో ధరియించి నిలిచెదము నిలిచెదము లోక ఘాతకుఁడైన పి శాచిని యెదిరించి కట్టెదము కట్టెదము ||యేసు||
5. శోక మొందక యేసు రాకడ కాశించి రంజిల్లు చుండెదము దూత మూఁకలతో గూడి మోద మొప్ప యేసుని పొగడెదము పొగడెదము ||యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment