Tuesday, April 3, 2018

CHAERIKOLVUAODI KREESTHUNI PAA TELUGU LYRICS

చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి కొల్వుఁడి చేరి కొల్వుఁడి స్థిరమతితో మీ నోరు నిండ మది కోరికఁ దీరఁ ||జేరి||

1. ధీరకలితుఁ డుప కారకుఁ డితఁ డని యారూఢిగ మదిఁ గోరి ప్రియమునఁ ||జేరి||

2. జనకుని యుగ్రం బును దా నోరిచి జనులకు మేలు నో సంగి ఘనునిఁ ||జేరి||

3. సార చరిత్రో దారుఁడు పాతక ధీరుఁడు శుద్ధా చారుండితఁడని ||జేరి||

4. దేవుని కొమరుఁడు ధీవిస్తారుఁడు సేవ కావనుఁడు క్షేమకరుండని ||జేరి||

5. యేసుని వారల నీశుఁడు మన్నన జేసి తప్పు క్షమ చేయునుగానఁ ||జేరి||

6. మరణము నొందిన నరులను గృపఁ గ్ర మ్మరఁ బ్రతికించిన మహిమోజ్వలునిఁ ||జేరి||

7. పలు దయ్యంబులఁ బారఁదరిమి రో గుల రక్షించిన మలినాపహునిఁ ||జేరి||

8. జను లచ్చెరు వొం దను మూఁగకు నో రును గన్నులు చీఁ కునకిడినాఁ డని ||చేరి||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...