Wednesday, April 18, 2018

GHANA YEHOAVAA NEE GUDAARM TELUGU LYRICS


ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు ||ఘన||

1. వెలఁయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ ||ఘన||

2. తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు ||ఘన||

3. వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు ||ఘన||

4. మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము అరయఁ డిట్టులఁ జేయువాఁడే ధర నెపుడు గదల్పఁబడఁడు ||ఘన||

5. జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్ ||జనక||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...