Wednesday, April 18, 2018
HAE PRABHUYAESU HAE PRABHU TELUGU LYRICS
హే ప్రభుయేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా, శాంతికరా ||హే ప్రభు||
1. శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ శాంతి స్వరూపా, జీవనదీపా శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||
2. తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా విఫలులు జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా ||సిల్వధరా||
3. మతములు వెదకిన నిన్నెగదా వ్రతములు గోరిన నిన్నెగదా పతి తులు దేవుని సుతులని నేర్పిన హితమతి వీవెగదా ||సిల్వధరా||
4. పలుకులలో నీ శాంతి కధ తొలకరి వానగ గురిసెగదా మలమల మాడిన మానవహృదయము కలకలాడెకదా ||సిల్వధరా||
5. కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత మానవ మైత్రిని సిల్వపతాకము దానము జేసెగదా ||సిల్వధరా||
6. దేవుని బాసిన లోకములో చావుయె కాపురముండెగదా దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివి గదా ||సిల్వధరా||
7. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండెగదా దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి వీవెగదా ||సిల్వధరా||
8. ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవెగదా ఖలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయెగదా ||సిల్వధరా||
9. కలువరిలో నీ శాంతి సుధా సెలయేఱుగ బ్రవహించెగదా కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా ||సిల్వధరా||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment