Wednesday, April 18, 2018

KALVARI GIRILONA SILVALO SHREE TELUGU LYRICS


కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)
నీ కోసమే అది నా కోసమే (2)

ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు (2)
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు (2)

వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు (2)
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు (2)

సాతాను మరణమున్ గెల్చి
పాతాళ మందు గూల్చి (2)
సజీవుడై లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు (2)

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...