Wednesday, April 18, 2018
MAANAVUAODAVAI SAKALA NARULA TELUGU LYRICS
మానవుఁడవై సకల నరుల మానక నా దోషములఁ బాపుటకు బలి యైతివే యేసూ బహు ప్రేమతోడ ||మానవుఁడవై||
1. నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు నియమంబు నిచ్చి ||మానవుఁడవై||
2. నీవె జీవపు రొట్టె వంటివి నీవె జీవ జలంబు వంటివి నిన్ను ననుభ వించుఁడంటివిగా నిజదేవా యేసూ ||మానవుఁడవై||
3. నీ శరీరము రొట్టెవలెనే నిజముగా విరువంగఁబడెనే నిన్నుఁ దిను భాగ్యంబు నిచ్చితివే నా యన్న యేసూ ||మానవుఁడవై||
4. మంచి యూట మించి దండి పంచగాయములలో నుండి నిత్యజీవపు టూటలు జేసితి నీ ప్రేమ నుండి ||మానవుఁడవై||
5. నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుఁడంటివి నీ నిజభక్తితోడ ||మానవుఁడవై||
6. ఎంతో ప్రేమతో బలిగా నైతివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప శ్రీ యేసు దేవా ||మానవుఁడవై||
7. నిత్యబలి యగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను నిముడించుకొని నాలో నీ నిజరూప మొంద ||మానవుఁడవై||
8. నేను నీ బలిలోనఁ గలిసి నేను నీతోఁ గలిసి మెలిసి నేను నీవలె నుండఁ జేసితివే నా దివ్య యేసూ ||మానవుఁడవై||
9. నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు పాపభారములు దిగునే నా దివ్య యేసూ ||మానవుఁడవై||
10. నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి నున్నావే నిజ దేవా యేసూ ||మానవుఁడవై||
11. నీవే నీ చేతులతో నిత్తువు ఈ నీ బలివిందునకు వత్తువు నిన్ను నిట జూచితిని నా యేసూ! యెన్నఁడును మరవను ||మానవుఁడవై||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment