Tuesday, April 3, 2018

MANCHI DEVUDU BHALE MANCHI TELUGU LYRICS

మంచి దేవుడు భలే మంచి దేవుడు
నిజ దైవం యేసు - అద్వితీయ దేవుడు

1. మ్రొక్కులను కోరడు - మనసిస్తే చాలును
కొండలెక్కి రమ్మనడు - మనలో కొలువుంటాడు
వెదికితే ప్రతి వారికి - దొరికేను యేసు
పిలిచే ప్రతి వారికి - పలికేను యేసు
బొమ్మ కాదయ్యో - జీవమున్న దేవుడు "మంచి"

2. కుంటివాడు గంతులేయ - కాళ్ళ నొసగినాడు
మూగవారు స్తుతిచేయ - నోటినిచ్చినాడు
బధిరులు తన స్వరము విన - చెవులిచ్చినాడు
ప్రేమా మయుడు - ఆశ్చర్య దేవుడు "మంచి"

3. చెప్పింది చేసెను - మాదిరుంచి వెళ్ళెను
అడుగు జాడాలుంచెను - అనుసరించ కోరెను
మరణాన్ని జీవాన్ని - మన ఎదుటే వుంచెను
ఎంచుకొనే స్వేచ్చను - మన చేతికిచ్చెను
ఏమి చేతువో - సృష్టికర్త యేసుని "మంచి"

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...