Thursday, April 19, 2018
PRABHUYAESU SMGHAMU NIRMIMCHUCHUMDA TELUGU LYRICS
పల్లవి: ప్రభుయేసు సంఘము నిర్మించుచుండ
గర్విసాతాను జయమొంద లేడు
1. పరలోకమాదిరి నిర్మించుచుండె
నరుని ఆలోచన జరిగింప
డిందు - స్థిరపునాదిపై నిర్మించుచుండె
పరిపూర్ణతను విరివిగా నింపున్
2. ఆదాముతో కూడ నడిచిన దేవుడు
గుడారమున వసియించినాడు
సొలొమోనాలయము నింపినాడు
కాలమెల్ల తనయునిలో వసించున్
3. క్రీస్తు ప్రభు దాని స్థిరపునాది
ఇసుక పై వేసిన నశియించునంత
సజీవుడగు యేసు నిజ మూలరాయి
సజీవరాళ్ళను విజయుడు జేర్చున్
4. నిత్య దేవుని నిజ ఆత్మజులారా
ఆత్మీయంబగు ఆలయము మీరే
ఆత్మ ఐక్యమును అనుసరించుడి
హస్తకృతంబులు ఆలయమగునా?
5. యూదుడని మరి హెల్లేనీయుడని
లేదు జాతుల భేదము లేమి
లేదు దాసుడు స్వతంత్రుడని
భేదముండదు స్త్రీ పురుషులని
6. ఏ నామమున లేనిది సంఘము
నామమిచ్చిన యెన్నదగు కీడు
కనబడు కట్టడములు కలిపి పోల్తుమా
కనివిడిచెదము పొరబాటులను
7. ప్రకటించెదము ప్రాకటముగను
ఏక మనస్సుతో ఏక శరీరమని
సకల కాలము శక్తితో నిలిచి
పొగడుచు శిరస్సును పాడెద మిపుడె
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment