Thursday, April 19, 2018

PRAVIMALUDAA PAAVANUDAA STHUTHISTHOATHRAMU TELUGU LYRICS


పల్లవి: ప్రవిమలుడా పావనుడా - స్తుతిస్తోత్రము నీకే
పరమునుండి ప్రవహించె - మాపై కృప వెంబడి కృపలు

1. నీ మందిర సమృద్ధివలన - తృప్తిపరచు చున్నావుగా
ఆనంద ప్రవాహ జలమును - మాకు త్రాగనిచ్చితివి
కొనియాడెదము నీ కృపకై ఆనందించుచు పాడెదము

2. దేవుని సంపూర్ణతలో మమ్ము - పరిశుద్ధులుగా జేసియున్నావు
జ్ఞానమునకు మించిన ప్రేమ మాలో బయలు పరచితివి
కృతజ్ఞతలు చెల్లించుచు పూజించెదము నిన్నెప్పుడు

3. దైవత్వము నిండియుండెనుగా క్రీస్తు యేసు ప్రభువునందు
ఆయనయందు సంపూర్ణులుగా మమ్ము జేసియున్నావు
సాగిలపడుచు నీ కృపకై ఆరాధింతుము నిన్నిలలో

4. నిర్ధోషులుగా నిరపరాధులుగా నీ రక్తముతో మము జేసితివి
సర్వసంపూత్ణత మాకిచ్చి సిలువలో సంధిజేసితివి
నిత్యము నిన్ను స్తుతించి ఘనపరచెదము నిన్నిలలో

5. కృపా సత్యసంపూర్ణుడవై మామధ్యలో నివసించితివి
లోకమునందు నమ్మబడితివి అద్వితీయ తనయుడవై
నిరతము నిన్ను కీర్తించి సమాజములో పాడెదము

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...