ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో ఉంటే చాలు ||2||
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు ||2|| ||ప్రియ యేసు||
యేసుని రక్తమందు కడుగబడి
వాక్యంచే నిత్యం భద్రపరచబడి ||2||
నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను ||2||
బంగారు వీదులలో తిరిగెదను ||2|| ||ప్రియ యేసు||
ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ ||2||
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి ||2||
ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ ||2|| ||ప్రియ యేసు||
హృదయము స్తుతులతో నింపబడెను
నా భాగ్య గృహమును స్మరించుచు ||2||
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ||2||
వర్ణింప నా నాలుక చాలదయ్యా ||2|| ||ప్రియ యేసు||
ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో
ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో ||2||
తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ||2||
ఆశతో వేచియుండే నా హృదయం ||2|| ||ప్రియ యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment