Tuesday, April 17, 2018

RAARAE MANA YAESU SVAAMINI TELUGU LYRICS


రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు
లారా పేర్మిని గూరిమి భక్తులఁ విందుట భూరిద యామృత
సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుఁడఁట నారకులగు
నర నారీజనులకు దారక మొసఁగను దానె పిలుచునఁట దారుణ
పాప మ హారణ్యమునకుఁ గారుచిచ్చు గతి గంపడువాఁడట
ఘోరదరిద్రతఁ గూల్చెడివాఁడట సారం బగు తన సభకు మకుటమఁ
ట ||రారే||

1. పతిత పావనమౌ వేల్పఁట అనాది దేవ సుతుడై యిలఁ జేరి నాఁడఁట
సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు
హితభాస్కరుఁడఁట అతిలిత మోక్షో న్నత గుణగణుఁడఁట
కుతలంబున స ద్గతి రహితంబగు పతితులఁ గావను మృతుడైనాఁ
డఁట అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను
నతడొసంగెనఁట మృతిని జయించుచు బ్రతికి లేచెనఁట మతి నమ్మిన
మన గతి యితఁడేనఁట ||రారే||


2. తుదిలేని మహిమవాఁడఁట తనుఁగొల్చు సాధు హృదయుల సొమ్ము
మూటఁట చెదరిన గొఱ్ఱెల వెదకవచ్చెనఁట చిదురుపలగు జన
హృదయము లన్నిటఁ బదిలముగా నె మ్మది నిడువాఁడఁట నదితట
మఠ జన వదనముల స మ్మద శుభవార్తనుఁ బలికినవాఁడఁట
సదయత నంధుల కక్షుల నిడెనఁట వెదకి బధిరులకు వీను
లొసఁగె నఁట సదమల మోక్ష ప్రదుఁడగు విభుఁడఁట యిదిగో
మనకిత డేలినవాఁడఁట ||రారే||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...