Monday, April 30, 2018
VANDHANAMBHONARTHUMO PRABHU TELUGU LYRICS
పల్లవి:
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో (2X)
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా - వందనంబు లందుకో ప్రభో
1.
ఇన్నినాళ్ళు ధరని మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి యెపుడు
గాచియు - నెన్నలేని దీవెన లిడు నన్న యేసువా - యెన్నిరెట్లు స్తోత్రము లివిగో
...వందనం...
2.
పాత వత్సరంపు బాపమంతయు - బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునకు నీదు నీతి నొసగుమా - దాతా క్రీస్తు నాధ రక్షకా
...వందనం...
3.
దేవ మాదు కాలుచేతులెల్లను - సేవకాళి తనువు దినములన్నియు నీవొసంగు
వెండి పసిడి - జ్ఞాన మంతయు నీ సేవకై యంగీకరించుమా
...వందనం...
4.
కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు తీర్చుము
పాతకంబులెల్ల మాపి - భీతి బాపుము - ఖ్యాతి నొందు నీతి సూర్యుడా
...వందనం...
5.
మా సభలను పెద్దజేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తి నీయుము
మోసపుచ్చు నంధకార - మంత ద్రోయుము - యేసు కృపన్ గుమ్మరించుము
...వందనం..
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment