Tuesday, April 17, 2018
VIJAYMBU VIJAYMBU VIJAYMBU TELUGU LYRICS
విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు గెల్చి నేఁడు వేంచేసె యజమానుఁ డెల్ల ప్ర యాసము లెడఁబాప స్వజనుల రక్షింప సమసె సిలువమీఁద ||విజయంబు||
1. విజయంబు విజయంబు విజయంబు మానవుల వృజిన నివృత్తిని విభుఁ డొనరింపన్ గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది విజిత మృత్యువు నుండి విజయుండై వేంచేసె ||విజయంబు||
2. విజయంబు విజయంబు విజయంబు మా యేసు భుజము మీఁదను మోయుఁ బరిపాలనంబు కుజము మీఁదను బ్రాణ త్యజనము జేసెను ధ్వజము మోయుచు సిల్వ పాప మోడింతము ||విజయంబు||
3. విజయంబు విజయంబు విజయం బిఁకను మా క పజయము కాకుండఁ బ్రభు యేసు క్రీస్తు సుజనత్వమున వైరి వ్రజము గెల్వఁగఁజేసి నిజముగఁ బరలోక నిలయంబులో నిల్పు ||విజయంబు||
4. విజయంబు విజయంబు విజయం బనెడి పాట నిజభక్తితో మనము నేర్చిన వాని భజియించుదము భూన భములు తాఁ బాలించు అజిత జీవ ప్రదుఁ డమరత్వ మిడు మనకు ||విజయంబు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment