Thursday, April 26, 2018
VISUKADHAE PRAANMBU VIJNYAANI TELUGU LYRICS
విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను అసదు గానట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫల మొసగుఁ నది యేది ||విసుకదే||
1. మును పేది యుండెనో వెనుక నదియే యుండు మునుపు వెనుకకు మధ్య మున నున్న దదియే నొనరంగఁ గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి ఘనకార్య మొక్కటియుఁ గానంగరాదు ||విసుకదే||
2. ధరణి మీఁదికి దిగం బరుఁబగుచు నేతించు మరణ మప్పుడు దిగం బరుఁడగుచుఁ బోవున్ నర్రుడు పుట్టినఁడు సరెకెద్దియును తేఁడు మరణమగు నాఁడొక్క సరకుగొనిపోఁడు ||విసుకదే||
3. ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు సకల వంశము లిట్లు సమసిపోవుచుండు నిఁక వారి పేర్పింపు లెచ్చోట నేమాయె నొకండైన చెప్పుటకు నుర్విలో లేఁడు ||విసుకదే||
4. ఏటివంకలు దీర్చ నెవ్వాని కలవి ము న్నీటి మూఁకుడు సేయ నేర్పరి యెవండు మోటైన మనసు వం పులు దీర్చు గురు వెవఁడు కోటి ధనమిచ్చినను కుంభినిని లేఁడు ||విసుకదే||
5. ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొఱకు మరణమై లేచు స ద్గురు డైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు సుఖ ప్రాప్తి యొనరించున్ ||విసుకదే||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment