Thursday, April 26, 2018
VMDHANAMAYYAA YAESU NEEKU VMDH TELUGU LYRICS
వందనమయ్యా యేసు నీకు వందనమయ్యా మా కోరిక లందియ్య వయ్యా వందనమయ్య నీ సుందర పాదార విందములకు భక్తి వినతులు గావింతు సందియంబులులేని పరమానందమున నీయందు డెందము పొందుపడఁ జేయవె యెహోవా నందనా పాపేంధనాగ్ని ||వందనమయ్యా||
1. నర దైవత్వములు రెండుగూడి పరిపూర్ణమైన దేహాత్మలు ధరియించి యందు లేశంబయిన దురితంబులేని యవతారము నెరవుగా దాల్చి ధరణికి నేతెంచి నిరయార్హూలగు సర్వ నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము విరివిగా పరుగెత్తఁ జేయుచు విమలమగు నీ ప్రాణరక్తము లరుదుగా సమర్పణము ,చేసియు తిరిగి లేచితివో మహా ప్రభూ ||వందనమయ్యా||
2. నీ పుణ్యమందు నమ్ముకొనెడి యే పాపియైన తక్షణమున శాపంబుఁ బాసి త్రాణగలిగి నీ సజ్జనుండు కృపవానిని కాపాడుచుండు దీపించు భవ దీయ దివ్య వాగ్దత్తంబు లాపత్పరంపరల కడ్డుపడుచు నుండి నీ వయిందన భారమెల్లను మోపి యోపికనుండ నేర్చిన పాపిపుణ్యండగుచు నాత్మను భవ్య సుఖ మఖిలంబుఁబడయును ||వందనమయ్యా||
3. శమదమ ప్రేమ కృపా వినయ సద్గుణములనెడి భూషణముల నిమిడియున్నట్టి తనువు దాల్చి క్రమముగానందు దైవత్వము కనుపఱచినావు విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య సముదయమునకు నుత్తముగా బోధించి యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను సిలువను శ్రమను మృతికల్పించి మృత్యువుఁజంపి జీవించిన మహాత్మా ||వందనమయ్యా||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment