Monday, May 28, 2018
KUMMARI OA KUMMARI JAGATHUTHPATHTHIDHAARI TELUGU LYRICS
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా
1.పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2)
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి
ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
2.విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2)
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా
ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
3.లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2)
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment