Sunday, May 13, 2018

MANA PATTANMBADHIGOA MANA PAURATHVMBADHIGOA TELUGU LYRICS


పల్లవి: మన పట్టణంబదిగో - మన పౌరత్వంబదిగో
కానాను పురమదిగో - మన యేసుకు జేయునమో

1. ఆర్భాటంబులతో - విజయోత్సవంబులతో
ఏతెంచిన ప్రభు జేరి - పాత భక్తుల జేరి
మధ్యాకాశంబుననూ - హల్లెలూయా పాడెదము

2. జీవ జలనది - పారు నాసనమునుండి
ఆవల నీవలనూ - జీవ వృక్షంబుండు
నెల నెల కాయును - పండ్రెండు కాపులను

3. నూతన భువియందు - నూతన యెరూషలేముండు
నూతన వెలుగుననూ - నూతన ప్రజలౌదుము
నూతనాలయము - గొఱ్ఱెపిల్లయే తాను

4. తేజోమయునితో - మరి తేజోవాసులతో
తేజరిల్లుదుము - తేజో రాజ్యమునందు
సజీవ జనకుని - సజీవ జనులమని

5. చేరుదు మాపురము - పరమ పరదైసునకు
కరువు మరణములు - కానము ఎన్నడును
మహిమలో నిత్యంబు - ప్రభు యేసుతో నుందుము

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...