Sunday, May 13, 2018

MANAMEE MANUMEE MANASA NEE TELUGU LYRICS


మనమీ మనుమీ మనస నీ వనుదినము యేసుని సరస ఘన ధనముల నీవు రోసి దేవ తనయుని కృపఁ దల పోసి ||మనమీ||

1. మంకు తనములను విడిచి నీ భయంకర వేదనకు వెరచి యింక వడి యేసు కడ కేగి పాద పంకజముల యొద్ద దాఁగి ||మనమీ||

2. ప్రాకటముగ నొప్పు నట్టి దైవ వాక్యంబు మనమునఁ బెట్టి శ్రీ కర నాధుని నమ్మి ధాత్రి నీ కలుషమ్ములును జమ్మి ||మనుమీ||

3. సృష్టి ప్రభువు నీకు లేఁడ యతని యిష్ట గుణగణమ్ములు బాడ ఇష్టము తోడను వేఁడి నీదు దుష్ట గుణమ్ముల వీడి ||మనుమీ||

4. చెంతఁ జేర వల దన్నాఁడ కడు వింతెన జనకుఁడు గాఁడా చింతలు నీకిఁక నేల బహు సంతోషమున యేసు పాల ||మనుమీ||

5. బిరబిర వరగురు దరికి నీ వరుగుము దురితముఁ బెరికి సురిచిరమగు యేసు కరుణ నీకు మరణపు తరి నగు నాదరణ ||మనుమీ||

6. నిరతమ్ము నాతనిమీఁద నీదు దురితముల నునుపరాద త్వరితమ్ముగ నెమ్మిఁ జూపి దుష్ట చరితమ్మును వెళ్లబాపి ||మనుమీ||

7. అమలాప్తుఁడు నిను డాయు నీదు శ్రమ లన్నియు వెడలఁ జేయు విమలాత్మను దయచేయ నీతి కమలాప్తుని మది కీయ ||మనుమీ||

8. అంచితముగ నుతి సేయు నిన్ రక్షించిన కృపా సంస్త్యాయు నెంచుచు నాతని విభునిగఁ గీర్తించుచుఁ బరమ గురునిగ ||మనుమీ||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...